- నేడు ఇండియా-ఎ, పాకిస్తాన్-ఎ జట్ల మధ్య కీలక పోరు
- ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్ క్రికెట్ టోర్నీలో భారత పురుషుల జట్టు కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. గ్రూప్-బిలో భాగంగా ఆదివారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు పటిష్ట పాకిస్తాన్‌తో తలపడనుంది. తొలి లీగ్ మ్యాచ్‌లో భారతజట్టు 306 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తుచేయగా.. పాకిస్తాన్ జట్టు 61 పరుగుల తేడాతో యుఎఇను ఓడించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఎనిమిది జట్ల మధ్య జరుగుతున్న ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారతజట్టు సెమీస్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. శుక్రవారం జరిగిన గ్రూప్-బి తొలి లీగ్ మ్యాచ్‌లో తిలక్ వర్మ, కుమార్ కుషగ్ర సెంచరీలతో రాణించడంతో భారత్-ఎ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత ఫ్రిన్స్ యాదవ్(5/6), హర్షిత్ రాణా(4/16) బౌలింగ్‌లో రాణించడంతో నేపాల్ జట్టు 11.3ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్-ఎ జట్టు 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఈ గ్రూప్‌లో టాప్‌లో ఉంది.
జట్లు(అంచనా)...
ఇండియా-ఎ: తిలక్ వర్మ(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఆయుశ్ బడోనీ, కుమార్ కుషగ్ర, రింకు సింగ్, సుయాన్ష్ షెడ్జే, షాబాజ్ అహ్మద్, విప్‌రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్.
పాకిస్తాన్-ఎ: అబ్దుల్ సమద్(కెప్టెన్), హుసైన్, షదాకత్, నజీర్, హసన్ నవాజ్, ఫర్హాన్, మసూద్, మహ్మద్ ఇమ్రాన్, అహ్మద్ దానియల్, సోఫ్యాన్ ముఖీమ్.








కామెంట్‌లు (0)