శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

U-19 Asia Cup: ఖాదిర్‌ ఔట్‌.. పాక్‌ రెండో వికెట్‌ డౌన్‌

1 రోజు క్రితం

U-19 Asia Cup: Pakistan wins the toss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పాకిస్థాన్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రమాదకర బ్యాటర్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. అర్జున్‌ రాజ్‌పుత్‌ వేసిన 27వ ఓవర్‌ చివరి బంతికి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న వినీత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఉస్మాన్‌ ఖాన్‌తో కలిసి నెలకొల్పిన 135 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఓవర్‌లో అర్జున్‌ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్‌లో యశ్‌ కూడా మూడు పరుగులే సమర్పించుకున్నాడు. 27 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్‌ 197 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్‌ ఖాన్‌ 86 పరుగులతో క్రీజులో ఉండగా, ఫర్హాన్‌ బ్యాటింగ్‌కు దిగాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన పాక్‌.. 78/1

పాకిస్థాన్‌ జట్టుకు టీమ్‌ఇండియా తొలి షాక్‌ ఇచ్చింది. కావ్యా పటేల్‌ వేసిన 8.1వ ఓవర్‌లో ఓపెనర్‌ హయమ్‌ ఖాన్‌ (21) ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ దిశగా వచ్చిన బంతిని ఆడే ప్రయత్నంలో వికెట్‌ కీపర్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అబ్దుల్‌ ఖాదిర్‌ దూకుడుగా ఆడాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాది స్కోరు వేగాన్ని పెంచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. అంతకుముందు మనల్‌ చౌహాన్‌ వేసిన ఏడో ఓవర్‌లో ఆరు పరుగులు నమోదయ్యాయి. తొమ్మిది ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్‌ ఒక వికెట్‌ నష్టానికి 78 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాన్‌ 33 పరుగులతో, అబ్దుల్‌ ఖాదిర్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.


భారత్‌పై టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌.. తొలుత బ్యాటింగ్‌

మెన్స్‌ అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌–పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత జట్టు తొలుత బౌలింగ్‌ చేయనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌పై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
భారత్‌–పాకిస్థాన్‌ అండర్‌-19 ఫైనల్‌ జట్ల వివరాలు

పాకిస్థాన్‌ జట్టు: ఉస్మాన్‌ ఖాన్‌ , హయామ్‌ ఖాన్‌ , అబ్దుల్‌ ఖాదిర్‌, ఫర్హాన్‌ యూసఫ్‌ (కెప్టెన్‌), అహ్మద్‌ హుస్సేన్‌ ,అలీ రజా, హంజా జహూర్‌ (వికెట్‌ కీపర్‌),హస్నైన్‌ అబ్బాస్‌ దార్‌, మహ్మద్‌ సయ్యమ్‌, రిజ్వానుల్లా,నిఖాబ్‌ షఫీక్‌

భారత్‌ జట్టు: లక్ష్య రాజేష్‌ రాయ్‌చందానీ (కెప్టెన్‌), ఆర్యవీర్‌ సెహ్వాగ్‌, వి.కె. వినీత్‌, యశ్వర్ధన్‌ చౌహాన్‌ , అర్జున్‌ రాజ్‌పుత్‌, అన్వయ్‌ ద్రవిడ్‌ (వికెట్‌ కీపర్‌), మనల్‌ చౌహాన్‌, మోహిత్‌ ఉల్వా, ఆర్యన్‌ సవ్సాని,కావ్య పటేల్‌, చిరుపతి వెంకట

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్