సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Women's Asia Cup : భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

16 గంటల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన

మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం భారత మహిళల జట్టును బిసిసిఐ ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనుండగా, స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నారు. భారత జట్టులో షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్ వంటి కీలక ఆటగాళ్లకు చోటు లభించింది. అయితే స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు మాత్రం నిరాశ ఎదురైంది. చీలమండ లిగమెంట్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమెను ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేయలేదు. ఇదే గాయం కారణంగా ఆమె గతంలో టీ20 ప్రపంచకప్‌ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది.

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.

రిజర్వ్ ఆటగాళ్లు:
ప్రతీకా రావల్, ఉమా చేత్రీ (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సయాలి సాత్‌ఘరే, మిన్ను మణి.

స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తున్న భారత జట్టు ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియా కప్ 2026 పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్