- క్రొయేషియాపై 2-1 విజయం స్పెయిన్ సునాయాసంగా...
టొరంటో: కెనడా వేదికగా పోర్చుగల్, క్రొయేషియా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పోర్చుగల్ జట్టు గెలిచింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో రెండు అర్ధభాగాల సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1గోల్స్‌తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలో ఒక గోల్ కొట్టి పోర్చుగల్ విజయం సాధించింది. రెండో అర్దభాగంలో... ఇవాన్ పెరిసిక్ 53వ నిమిషంలో గోల్ కొట్టడంలో క్రొయేషియా ఖాతా తెరిచింది. ఈ క్రమంలో పెనాల్టీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. ఇక అదనపు సమయంలో (90+4) రామోస్ గోల్ కొట్టి పోర్చుగల్ ఆధిక్యాన్ని 2-1కు పెంచాడు. అయితే, 103వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడు జోస్కో గవార్డియాల్ గోల్ కొట్టగా.. సమీక్ష తర్వాత వీడియో అసిస్టెంట్ రిఫరీ(విఎఆర్) మాత్రం దీనిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటించాడు. దీంతో క్రొయేషియా నిరాశలో మునిగిపోగా.. పోర్చుగల్ 2-1తో జయభేరి మోగించి.. రౌండ్ 16కు దూసుకవెళ్లింది. కాగా ఆటగాడు బాల్‌ను అందుకునే సమయంలో ప్రత్యర్థి జట్టు చివరి డిఫెండర్ కంటే ముందు ఉండి.. తద్వారా ఆటలో ప్రభావం చూపినట్లయితే దానిని ఆఫ్‌సైడ్‌గా ప్రకటిస్తారు. ఆ సమయంలో సదరు ఆటగాడు గోల్ కొట్టినా అది చెల్లదు.
రికార్డు పుటల్లోకి రొనాల్లో
పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. రొనాల్డో 41 ఏళ్ల 147 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. తద్వారా ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో 40 ఏళ్ల వయసు తర్వాత గోల్ కొట్టిన ఫుట్‌బాలర్‌గానూ రొనాల్డో చరిత్రకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్32లో భాగంగా క్రొయేషియాతో మ్యాచ్ సందర్భంగా రొనాల్డో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు పోర్చుగల్‌కే చెందిన పెపె పేరిట ఉండేది. 2022లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 39 ఏళ్ల 283 రోజుల వయసులో పెపె గోల్ కొట్టాడు. తాజాగా రొనాల్డో ఆ రికార్డును బ్రేక్ చేశాడు.
స్పెయిన్ అలవోకగా..
లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ రౌండ్-32లో స్పెయిన్ జట్టు అలవోకగా ఆస్ట్రియాపై విజయం సాధించింది. ఆస్ట్రియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. స్పెయిన్ జట్టులో మైఖేల్ ఒయర్‌జబల్, పెడ్రో పోర్రోస్ గోల్స్ చేశాడు. ఒయర్జబల్ రెండో గోల్స్ చేసి స్పెయిన్ జట్టుకు సునాయాసంగా విజయాన్నందించాడు. తొలి అర్థభాగం చివరలో ఒయర్‌జబల్ స్పెయిన్‌కు ఫస్ట్ గోల్ అందించాడు. 36వ నిమిషంలో అతను గోల్ కొట్టాడు. రెండో అర్థభాగం 66వ నిమిషంలో పెడ్రో పోర్రో గోల్ చేయడంతో స్పెయిన్ ఆధిక్యత మరింత పెరిగింది. ఏ దశలోనూ ఆస్ట్రియా జట్టు స్పెయిన్‌ను నిలువరించలేకపోయింది. ఇక 89వ నిమిషంలో ఒయర్‌జబల్ రెండోసారి గోల్ చేసి స్పెయిన్‌కు భారీ విజయాన్నందించాడు. 1954 తర్వాత తొలిసారి ఆస్ట్రియా నాకౌట్ మ్యాచ్ ఆడి గెలుపొందడం విశేషం. సోమవారం డల్లాస్ వేదికగా స్పెయిన్, పోర్చుగల్‌తో తలపడనుంది.








కామెంట్‌లు (0)