పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు హామీ
కోల్‌కతా : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ గత ఏడాది డిసెంబర్‌లో భారత పర్యటనకు రాగా.. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మ్యాచ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 33 వేల మంది అభిమానులు స్టేడియం కిక్కిరిసిపోగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది సూచనతో మెస్సీ వెంటనే స్టేడియాన్ని వీడాడు. ఆ తర్వాత అక్కడ పరిస్థితులు అదుపు చేయలేకపోయారు. మెస్సిని చూసేందుకు అభిమానులు రూ.4 వేలు-8 వేల వరకు వెచ్చించి టికెట్ కొనుగోలు చేశారు. వారికి డబ్బులు వెనక్కి ఇచ్చే ప్రక్రియపై కసరత్తు మొదలైందని పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అదికారి తెలిపారు. ఆదివారం జరిగిన స్పెషనల్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈవెంట్‌లో సువేందు ఈ వ్యాఖ్యలు చేశారు. 'మెస్సి గ్లోబల్ స్టార్. అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మెస్సీని చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు మోసపోయారు. వారికి టికెట్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే అభిమానులు టికెట్ల డబ్బును పొందుతారని' సువేందు తెలిపారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే, ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఇంద్రనీల్ ఖాన్, హాకీ మాజీ ఆటగాడు గుర్‌బక్స్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)