గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionSAFF Championship: ఫుట్‌బాల్‌ సెమీస్‌కు భారత్‌

19 గంటల క్రితం

SAFF Championship
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 11:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాల్దీవులపై 1-0తో గెలుపు

  • శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌

ఢాకా: సాఫ్‌ ఛాంపియన్‌షిప్‌-2026 సెమీఫైనల్లోకి భారత పుట్‌బాల్‌ జట్టు దూసుకెళ్లింది. ఢాకా నేషనల్‌ స్టేడియంలో మాల్దీవులతో బుధవారం జరిగిన కీలక పోరులో భారత్‌ 1-0తో గెలిచి సెమీస్‌కు చేరింది. గ్రూప్‌-బిలో ఉన్న భారతజట్టు కనీసం డ్రా చేసుకున్నా నాకౌట్‌కు అర్హత సాధించేది. సుహైల్‌ భట్‌ తొలి అర్ధభాగంలో పెనాల్టీని గోల్‌ చేయడంలో భారత్‌ గెలిచింది. దీంతో భారత్‌ ఖాతాలో మరో మూడు పాయింట్లు జమ అయ్యాయి. దీంతో గ్రూప్‌-బిలో భారతజట్టు పాకిస్తాన్‌, మాల్దీవులకంటే ముందు నిలిచి నేరుగా సెమీస్‌ బెర్త్‌ సాధించింది. తొలి అర్ధభాగం ప్రారంభం నుంచి భారత్‌ బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మూడో నిమిషంలో సుహైల్‌కు సువర్ణావకాశం లభించినా.. గోల్‌ చేయలేకపోయాడు. ఆ తర్వాత 38వ నిమిషంలో మాల్దీవుల ఫార్వర్డ్‌ ఆటగాడు అబ్దుల్‌ రబీహ్‌ సుహైల్‌ను క్రింద పడవేయడంతో భారత్‌కు పెనాల్టీ లభించింది. పెనాల్టీని సుహైల్‌ భట్‌ ఎడమవైపు గోల్‌పోస్ట్‌లోకి బంతిని పంపి గోల్‌ చేశాడు. ఈ సీజన్‌లో సుహైల్‌కు ఇది మూడో అంతర్జాతీయ గోల్‌. దీంతో భారత్‌ గ్రూప్‌-ఎలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక గ్రూప్‌-బి నుంచి సెమీస్‌కు బంగ్లాదేశ్‌, భూటాన్‌ జట్లు ప్రవేశించాయి. బుధవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 4-0తో శ్రీలంకను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. ఇక భూటాన్‌, శ్రీలంక జట్లు ఒక్కో పాయింట్‌తో సమంగా నిలిచినా.. శ్రీలంక జట్టు 4-0తో బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమితో గోల్స్‌ వ్యత్యాసంతో భూటాన్‌ సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌, భూటాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భూటాన్‌ 1-0తో బంగ్లా చేతిలో ఓడింది. కానీ శ్రీలంక, భూటాన్‌ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ 2-2గోల్స్‌లో డ్రా అయ్యింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్