శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

స్విట్జర్లాండ్‌ 90ఏళ్ల తర్వాత...

1 గంట క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 12:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రౌండ్‌-32లో తొలిసారి గెలుపు.. 16వ సారి నాకౌట్‌కు

వాంకోవర్‌(‌కెనడా): స్విట్జర్లాండ్ ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. స్విట్జర్లాండ్‌ ‌తన 90 ఏళ్ల ప్రయాణంలో తొలిసారి నాకౌట్‌ దశలో విజయం సాధించింది. రౌండ్‌-32లో భాగంగా శుక్రవారం జరిగిన అల్జీరియాపై 2–0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి ఈ ఘనత సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్రి క్వార్టర్స్‌కు (రౌండ్‌ ఆఫ్‌ 16) చేరింది. స్విట్జర్లాండ్ మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 10 నిమిషాల్లోనే బ్రీల్ ఎంబోలో గోల్ చేసి శుభారంభం అందించాడు. ఆ గోల్‌కు జోహాన్ మాన్జాంబి అద్భుతమైన అసిస్ట్ అందించాడు. ప్రారంభ గోల్‌తో స్విట్జర్లాండ్ జట్టు అల్జీరియాపై రెట్టించిన విశ్వాసంతో ఆడింది. ఇక రెండో అర్ధభాగం ఆరంభమైన వెంటనే డాన్ న్డోయే మరో గోల్ సాధించడంతో స్విట్జర్లాండ్‌ 2–0 ఆధిక్యతలోకి వెళ్లింది. అనంతరం అల్జీరియా జట్టు పోరాటంలో నిలిచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ, స్విస్ రక్షణ విభాగం క్రమశిక్షణతో ఆ ప్రయత్నాలను అడ్డుకుంది.

అల్జీరియా కెప్టెన్ రియాద్ మహ్రెజ్ నాయకత్వంలో ఆ జట్టు కొంత సమయం బంతి నియంత్రణ సాధించినప్పటికీ, గోల్ చేసే అవకాశాలను సృష్టించుకోవడంలో విఫలమైంది. స్విట్జర్లాండ్ జట్టు మొత్తం మ్యాచ్‌లో సమతుల్య ఆటతీరు, వేగవంతమైన కౌంటర్ అటాక్స్ మరియు కఠినమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా మాన్జాంబి ప్రదర్శన మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే స్థాయిలో నిలిచింది. అతని పాస్‌లు, అటాక్‌లు స్విస్ జట్టుకు కీలకంగా మారాయి. ఈ విజయంతో స్విట్జర్లాండ్ ప్రపంచ కప్ నాకౌట్ దశలో తమ దీర్ఘకాలిక వైఫల్యాలకు బ్రేక్ వేసినట్లైంది. అనేక దశాబ్దాలుగా నాకౌట్ మ్యాచ్‌లలో నిరాశ ఎదుర్కొన్న స్విస్ జట్టు, ఈసారి స్థిరమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. తదుపరి దశలో స్విట్జర్లాండ్ జట్టు కొలంబియా-ఘనా మ్యాచ్‌ విజేతతో తలపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్