క్రీడలు : బ్యాడ్మింటన్ కోర్టులో భారత క్రీడాకారులు అద్భుత విజయాలతో పతకాలను సాధించారు. పురుషుల ఎస్‌ఎల్3 విభాగం ఫైనల్‌లో భారత షట్లర్లు నితేశ్ కుమార్, ప్రమోద్ భగత్ తలపడగా, నితేశ్ 21-18, 21-16 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రమోద్ భగత్‌కు రజత పతకం లభించింది.
ఎస్‌ఎల్4 విభాగంలో నవీన్ శివకుమార్ 21-9, 21-17తో ఇండోనేషియాకు చెందిన ఫెర్డీపై గెలిచి బంగారు పతకాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 విభాగం ఫైనల్‌లో తులసిమతి మురుగేశన్ చైనా క్రీడాకారిణి యాంగ్ చేతిలో 18-21, 11-21 తేడాతో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.
ఆర్చరీలోనూ స్వర్ణ విజయం ....
భారత్‌కు తొలి స్వర్ణ పతకం ఆర్చరీలో లభించింది. పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో హర్విందర్ సింగ్, విజయ్ సుండి జోడీ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌లో చైనా ఆర్చర్లను ఓడించి పసిడి పతకాన్ని సాధించింది.
పురుషుల టీ46 విభాగం 1500 మీటర్ల పరుగులో ప్రమోద్ 4 నిమిషాల 9.65 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకున్నాడు. శ్రీలంక అథ్లెట్ పువాక్‌పిటికండె 4 నిమిషాల 3.25 సెకన్లతో క్రీడల రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ రికార్డులు, స్వర్ణ విజయాలు, సమష్టి ప్రతిభతో పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దేశ ఖ్యాతిని మరింత పెంచుతున్నారు.








కామెంట్‌లు (0)