భారత యువ స్క్వాష్ స్టార్ అనహత్ సింగ్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. ఫైనల్లో ఈజిప్టు క్రీడాకారిణి రుఖయ్యా సలేంను వరుస గేముల్లో ఓడించిన అనహత్, 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈజిప్టు ఆధిపత్యానికి తెరదించడంతో పాటు 2010 తర్వాత ఈ టైటిల్ గెలిచిన తొలి నాన్-ఈజిప్షియన్ ప్లేయర్‌గా నిలిచింది.
కెనడాలోని నియాగరా-ఆన్-ది-లేక్‌లో శనివారం జరిగిన మహిళల ఫైనల్‌లో టాప్ సీడ్, వరల్డ్ నంబర్ 20 అయిన అనహత్, ఫైనల్‌లో ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ రుఖయ్యా సలేంను 11-3, 11-7, 11-9 తేడాతో వరుస గేముల్లో ఓడించింది. గత ఏడాది ఇదే టోర్నీలో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న అనహత్, ఈసారి అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను కైవసం చేసుకుంది.







కామెంట్‌లు (0)