శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పర్యటన

41 నిమిషాల క్రితం

kondapalli\.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కొట్టుకుపోయిన రహదారి పరిశీలన

ప్రజాశక్తి-వంగర: విజయనగరం జిల్లాలోని అరసాడ సమీపంలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వంగర–రాజాం ప్రధాన రహదారి, ముంపునకు గురైన పంట పొలాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శనివారం పరిశీలించారు. వరదల కారణంగా రహదారి దెబ్బతినడంతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరదలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి, ఎంపీ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు కోండ్రు జగదీష్‌, లచ్చు బుక్త కృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్