శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian Games: భారత్‌కు 17వ స్వర్ణం.. ఆర్చరీలో కుంకుమ్‌ మెరుపు

20 గంటల క్రితం

images.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 07:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

20వ ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం లభించింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ ఆర్చరీలో కుంకుమ్‌ మహోద్‌ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓయెజిన్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచారు. దీంతో ఆసియా క్రీడల సింగిల్స్‌ రికర్వ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా కుంకుమ్‌ రికార్డు నెలకొల్పారు.

తాజా పతకంతో భారత్‌ ఖాతాలో స్వర్ణ పతకాల సంఖ్య 17కు చేరింది. ప్రస్తుతం భారత్‌ 17 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 77 పతకాలు సాధించి ఐదో స్థానంలో ఉంది. కాగా, ఈ క్రీడల్లో కుంకుమ్‌ ఇప్పటికే రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచారు. శుక్రవారం అంకిత భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మహోద్‌లతో కూడిన భారత మహిళల రికర్వ్‌ జట్టు తొలిసారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. మిక్స్‌డ్‌ రికర్వ్‌లో ధీరజ్‌ బొమ్మదేవరతో కలిసి కుంకుమ్‌ రజత పతకం గెలిచారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్