శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionAsian Para Games:మూడు ప్రపంచ రికార్డులు

1 గంట క్రితం

sandeep.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • భారత్‌కు రికార్డు పతకాలు

  • నేటితో ముగియనున్న ఆసియా పారా క్రీడలు

న‌గోయా: 5వ ఆసియా పారా క్రీడల్లో భారత్‌ మూడు ప్రపంచ రికార్డులను నమోదు చేసింది. 400మీ. టి-44 పరు గును సందీప్‌ కుమార్‌ 52.28 సెక‌న్లలో పూర్తిచేసి తొలుత ప్రపంచ రికార్డును నమోదు చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. సౌదీ అరేబియాకు చెందిన నూర్ అల్స‌నా రెండో స్థానంలో నిలిచాడు. 400 మీట‌ర్ల స్ప్రింట్‌లో రెండు మెడ‌ల్స్ రావ‌డంతో.. ప్ర‌స్తుత పారా గేమ్స్‌లో భార‌త బృందం సాధించిన ప‌త‌కాల సంఖ్య వంద దాటింది. ఇక పురుషుల జావెలిన్‌ త్రోలో హానీ, మహిళల 50మీ. రైఫిల్‌-3 పొజిషన్‌లో మోనా అగర్వాల్‌ రికార్డు స్కోర్‌తో ప్రపంచ రికార్డులను నమోదు చేశారు. వీరంతా స్వర్ణ పతకాలతో సత్తా చాటారు. దీంతో భారత్‌కు ఆసియా క్రీడల్లో ఇప్పటిక దక్కిన పతకాల సంఖ్య 106కు చేరింది. శుక్రవారం జరిగిన 400మీ. టి-44 పరుగును సందీప్‌ కుమార్‌ 52.28 సెక‌న్ల‌లో పూర్తి చేశాడు. ఇదే ఈవెంట్‌లో మూడో స్థానం సాధించిన మరో భారత అథ్లెట్ అజయ్ కుమార్ (53.61 సెకన్లు) గేమ్స్‌ రికార్డుతో కాంస్య పతకాన్ని ముద్దాడాడు. ఇక జావెలిన్ త్రో ఎఫ్‌37 విభాగంలో హనీ ఐదో త్రోలోనే 59.72 మీ. విసిరి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. తన చివరి ఛాన్స్‌లో 60.49 మీ. విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఇక మహిళల 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌1 విభాగంలో స్వర్ణం నెగ్గిన మోనా అగర్వాల్ మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్‌లో 357.5 పాయింట్ల రికార్డుస్కోర్‌తో పసిడి సాధించింది. ఈ క్రమంలో స్వీడన్‌కు చెందిన అన్నా బెన్సన్‌ (356పాయింట్లు) పేరిట ఉన్న వరల్డ్‌ రికార్డును మోనా బద్దలు కొట్టింది.

దీంతో 5వ పారా క్రీడల్లో భారత్‌ మొత్తం 114 పతకాలు సాధించింది. ఇందులో 30 స్వర్ణాలు, 35 రజతాలు, 49 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో చైనా వేదికగా జరిగిన 4వ ఆసియా పారా క్రీడల్లో భారత్‌ సాధించిన(108పతకాలు) రికార్డును అధిగమించి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. శనివారంతో 5వ పారా క్రీడలు ముగియనున్నాయి.

MonaAgarwal.jpg

haney.jpg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్