బిసిసిఐ : టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కీలక అప్‌డేట్ అందించింది. ప్రస్తుతం అతడు బిసిసిఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. కాగా గిల్ ఇటీవల తరచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా .... కండరాల నొప్పితో గిల్ ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న గిల్.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమయారు. అతడి సారథ్యంలో టీమిండియా లంకతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. గాలె, కొలంబో వేదికలుగా భారత్- శ్రీలంక మధ్య ఆగష్టు 15 నుంచి తొలి టెస్టు.. ఆగష్టు 23 నుంచి రెండో టెస్టు ప్రారంభంకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సైకిల్ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ ఈ సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంకను 2-0తో వైట్‌వాష్ చేయాల్సిందే.
గిల్ కు గాయం ....
కాగా టీమిండియా శ్రీలంక గడ్డ మీద చివరగా 2017లో టెస్టు సిరీస్ ఆడింది. ఈ నేపథ్యంలో స్థానిక పిచ్ పరిస్థితులకు అలవాటు పడే క్రమంలో టీమిండియా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. అయితే, గురువారం నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే క్రమంలో గిల్ కుడిచేతి వేలికి గాయమయ్యింది. ఈ క్రమంలో టీం డాక్టర్ వచ్చి పరిశీలించి బ్రాండ్ ఎయిడ్ వేయగా.. గిల్ తిరిగి బ్యాటింగ్ చేశారు. అయితే, శ్రీలంక ఎలెవన్‌తో టాస్ సందర్భంగా గిల్ మైదానంలోకి రాలేదు. అతడికి బదులు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ కు వచ్చారు.
బిసిసిఐ అధికారిక ప్రకటన ....
ఈ నేపథ్యంలో బిసిసిఐ గిల్ గాయం నుంచి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయపడ్డారు. గురువారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి ఉంగరం వేలుకు గాయమయ్యింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా శ్రీలంక ఎలెవన్‌తో వామప్ మ్యాచ్‌లో తొలిరోజు గిల్ మైదానంలోకి రారు. బిసిసిఐ వైద్య బృందం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. గిల్ గైర్హాజరీలో ఈ మ్యాచ్‌లో కేఎల్ జట్టును ముందుకు నడిపిస్తారు’’ అని బిసిసిఐ తన ప్రకటనలో పేర్కొంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ....
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.








కామెంట్‌లు (0)