బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పవన్‌‌కు నిరసనల సెగ

56 నిమిషాల క్రితం

Protests against Pawan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం​ : పిఠాపురంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నిరసనల సెగ తగిలింది. శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని స్థానిక రథాలపేట అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్.పిఎస్ ఆధ్వర్యంలో దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్.పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.చిన్నబాబు మాట్లాడారు. శ్మశానం సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. సమస్యను పరిష్కరించే వరకూ కదిలేదని లేదన్నారు. దీంతో ఆర్.డిఒ మల్లిబాబు, పాడా పీడీ డాక్టర్ వి.శివరాం ప్రసాద్ వారితో మాట్లాడారు. సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అలాగే స్థానిక సిహెచ్.సి వద్ద పవన్ కాన్వాయ్ ను సహారా ఫీల్డ్ వర్కర్స్ డిపాజిటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ వర్కర్లు, డిపాజిట్ దారులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఆయనకు వినతిప్రతం అందించారు.


కూర్చొంటే పనులు కావు

తాను పిఠాపురంలోనే కూర్చొంటే పనులు కావని ఎక్కడ ఏ తీగ లాగితే పనులు అవుతాయో తనకు తెలుసునని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం ఉదయం పిఠాపురం ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. త్వరలోనే క్యాంపు ఆఫీసును పిఠాపురంలో పెడతానని తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి రూ.1,500 కోట్లు వెచ్చించామని, ఉప్పాడలో సముద్ర కోత నివారణకు ​రూ.323 కోట్లతో త్వరలోనే రక్షణ గోడ పనులు చేపడతామన్నారు. ఈ_కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్_శ్రీనివాస్, ఎంఎల్ఎలు పంతం నానాజీ, బత్తుల_బలరామకృష్ణ,_కలెక్టర్ హరేంధిర_ప్రసాద్ తదితరులు_పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్