కాన్‌కున్(మెక్సికో): భారత పురషుల టెన్నిస్ డబుల్ ద్వయం శ్రీరామ్ బాలాజీ, అనిరుధ్ చంద్రశేఖర్ కాన్‌కున్ కంట్రీ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. మంగళవారం జరిగిన ఫైనల్లో భారత జంట మెక్సికో-బెలారస్ జంట మిగ్యుల్ ఏంజెల్స్ రేయెస్-ఇవాన్ లియుతారెవిచ్‌పై 6-3, 7-6(7-4) విజయం సాధించారు. తొలి సెట్‌లో ఒక బ్రేక్ పాయింట్ సాధించి సునా యాసంగా విజయం సాధించగా.. రెండో సెట్‌లో ప్రత్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో ఆ సెట్‌లో ప్రతి ఒక్కరూ తమ తమ సర్వీసులను నిలబెట్టుకుంటూ వచ్చారు. దీంతో టై బ్రేకర్ అనివార్యమైంది. కానీ టై బ్రేకర్ లో భారత జంట 7-4పాయింట్లతో ఆ సెట్‌ను, మ్యాచ్‌ను ముగించారు. ఫైనల్లో భారత జంట 8 ఏస్‌లను సంధించగా.. ప్రత్యర్ధి జంట 4 అనవసర తప్పిదాలూ కలిసొచ్చాయి. కాన్‌కున్ టైటిల్ చంద్రశేఖర్‌కు టెన్నిస్ సర్క్యూట్‌లో 11వది కాగా.. ఈ ఏడాదిలో రెండోది. ఈ సీజన్ ఆరంభంలో, జపాన్ భాగస్వామి టకెరు యుజుకితో కలిసి బుసాన్ ఏటీపీ ఛాలెంజర్ 125 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది బాలాజీకి ఇది ఐదవ ఛాలెంజర్ టైటిల్ కాగా, అంతకుముందు సాధించిన నాలుగు విజయాలు నీల్ ఒబెర్‌లీట్‌నర్‌తో కలిసి దక్కినవే. అలాగే, ఛాలెంజర్ సర్క్యూట్‌లో ఆయన కెరీర్‌లో ఇది 15వ టైటిల్.
Print Editionబాలాజీ, అనిరుధ్‌కు కాన్‌కున్ టైటిల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)