చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంగ్జౌ: చైనా మాస్టర్స్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి కిదాంబి శ్రీకాంత్ దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో శ్రీకాంత్ వరుససెట్లలో ప్రపంచ 9వ ర్యాంకర్‌ను వరుససెట్లలో చిత్తుచేసాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-18, 21-19తో మ్యాచ్‌ను ముగించాడు. క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన లీ చౌక్ యూతో తలపడనున్నాడు. 2021లో టాప్‌సీడ్‌గా నిలిచిన శ్రీకాంత్.. ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోనూ రజత పతకంతో మెరిసాడు. ఇక మహిళల సింగిల్స్‌లో తన్వీ శర్మ, మిక్సడ్ డబుల్స్‌లో ధృవ్ జురెల్-తానీసా కాస్ట్రో జంటలు రెండోరౌండ్‌లో ఓటమిపాలయ్యారు. తైపీ ఓపెన్ ప్రపంచ టూర్ టైటిల్ నెగ్గిన తన్వీ శర్మ రెండోరౌండ్‌లో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్ మియాజెక్(జపాన్) చేతిలో పోరాడి ఓడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తన్వీ శర్మ 17-21, 21-18, 16-21తో జపాన్ షట్లర్ చేతిలో ఓటమిపాలైంద. ఇక మిక్సడ్ డబుల్స్‌లో తానీసా-ధృవ్ కపిల జంట 18-21, 18-21తో చైనీస్ తైపీ జంట చేతిలో పోరాడి ఓడారు. ఇక పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లోకి చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ప్రవేశించారు. మంగళవారం జరిగిన రెండోరౌండ్ గేమ్‌లో సాత్విక్-చిరాగ్ జంట 21-17, 22-24, 21-9తో క్రిస్టో పొపోవ్-టోమా జూనియర్ పొపోవ్(ఫ్రాన్స్)లను ఓడించారు. ఈ మ్యాచ్‌ను 69నిమిషాల్లోనే ముగించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు.







కామెంట్‌లు (0)