బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionChina Masters: సింధు, లక్ష్యసేన్‌, ఆయుశ్‌ ‌శుభారంభం

4 గంటల క్రితం

sindhulaksyaen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చైనా మాస్టర్స్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ

బీజింగ్‌: చైనా మాస్టర్స్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీలో ఆయుశ్‌ ‌శెట్టి, పివి సింధు రెండోరౌండ్‌‌కు చేరగా.. మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో రోహన్‌ ‌కపూర్‌-గద్దె రుత్విక శివాని తొలిరౌండ్‌‌లోనే ఓటమిపాలయ్యారు. పురుషుల సింగిల్స్‌‌లో ఆయుశ్‌ ‌శెట్టి 21-17, 5-21, 17-21తో అల్వీ ఫర్హాన్‌(ఇండోనేషియా)పై, లక్ష్యసేన్‌ 22-20, 15-21, 21-14తో జపాన్‌‌కు చెందిన టనకాపై మూడుసెట్ల హోరాహోరీ పోరులో నెగ్గి రెండోరౌండ్‌‌కు చేరారు. ఇక మహిళల సింగిల్స్‌‌లో పివి సింధు 21-14, 9-21, 21-10తో ఉన్నతి హుడా(భారత్‌)‌ను ఓడించింది. మరో మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో ధృవ్‌ ‌కపిల-తానీసా కాస్ట్రో జంట 18-21, 18-21తో 5వ సీడ్‌, చైనా జంట చేతిలో వరుససెట్లలో ఓటమిపాలయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్