- ఆతిథ్య హక్కుల బేరెన్‌ను అందుకున్న పిటి ఉష
గ్లాస్గో: నాలుగేళ్లకొకసారి జరిగే కామన్వెల్త్ క్రీడలు ముగిసాయి. జూలై 23న ప్రారంభమైన 23వ కామన్వెల్త్ క్రీడలు ఆగస్టు 3(సోమవారం) తెల్లవారుజామున జరిగిన ముగింపు వేడుకలతో దిగ్విజయంగా ముగిసాయి. 24వ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌కు క్రీడల నిర్వహణ పతకాన్ని రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, నీరజ్ చోప్రా, ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషకు అందజేశారు. 2030లో కామన్వెల్త్ క్రీడలు భారత్‌లోని అహ్మద్‌బాద్ నగరంలో జరగనున్నాయి. స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో 11 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 క్రీడల్లో ఈవెంట్ల సంఖ్యను కుదించి, కేవలం 10 క్రీడా విభాగాల్లో మాత్రమే పోటీలను నిర్వహించారు. భారత్‌కు ఖచ్చితంగా పతకాలు దక్కే క్రీడలైన షూటింగ్, రెజ్లింగ్(కుస్తీ), బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీలను నిర్వాహకులు చివర్లో తొలగించారు. దీంతో భారత్‌కు పతకాల సంఖ్య గతంలోకంటే ఈసారి తగ్గింది. పతకాల పట్టికలో టాప్-5లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. ఆ ఫీట్‌ను అందుకోవడం సంతోషించదగ్గ విషయం. ఈసారి భారత్‌కు మొత్తం 39 పతకాలు దక్కగా.. అందులో 13 బంగారు, 17 రజత, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్ పతకాల పట్టికలో ఆస్ట్రేలియా(171; 70స్వర్ణ, 45రజత, 56కాంస్యం) టాప్‌లో నిలువగా.. ఇంగ్లాండ్(110; 29+45+36) కెనడా(63; 19+21+23) టాప్-3లో చోటు దక్కించుకోగా.. ఆ తర్వాత స్థానంలో భారత్(39; 13+17+9) నిలిచింది. ఇక ఆతిథ్య స్కాట్లాండ్ (39; 13+9+17) టాప్-5లో చోటు దక్కించుకోగా.. 45 దేశాలకు పతకాల పట్టికలో చోటు లభించగా.. 29దేశాలకు కనీసం ఒక్క పతకం కూడా దక్కలేదు. 2026 కామన్వెల్త్ క్రీడల్లో 74 దేశాలకు చెందిన 3వేలకు పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్ పాడిన పాప్ సాంగ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలువగా.. ఈసారి ఆ ఫీట్‌ను అందుకుంది. ముఖ్యంగా మహిళా బాక్సర్లు, అథ్లెట్లు అత్యధిక సంఖ్యలో స్వర్ణాలు సాధించి సత్తాచాటారు. కామన్వెల్త్ క్రీడలు ముగియడంతో భారత అథ్లెట్లు తమ తదుపరి లక్ష్యం ఆసియా క్రీడలపై పెట్టారు.








కామెంట్‌లు (0)