77వ ర్యాంకర్ మార్కోస్‌పై గెలుపు
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల కుముందు భారత టెన్నిస్ అభిమానులకు శుభవార్త. భారత టెన్నిస్ స్టార్ ధక్షినేశ్వర్ సురేష్, సోమవారం విన్స్టన్-సేలం ఓపెన్‌లో ప్రపంచ 77వ ర్యాంకర్ మార్కోస్ గిరాన్‌ను వరుససెట్లలో చిత్తుచేశాడు. ప్రపంచ 394వ ర్యాంకర్ అయిన దక్షిణేశ్వరన్ 6-3, 7-5తో గిరాన్‌పై విజయం సాధించాడు. సురేశ్ తొలి ప్రయత్నంలోనే గిరాన్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో మొదటి సెట్‌ను 26 నిమిషాల్లోనే కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో 11వ గేమ్ వరకు ఇరువురు ఆటగాళ్లు తమ తమ సర్వీసులను నిలబెట్టుకోగా.. 5-5తో సమంగా ఉన్న దశలో గిరాన్ సర్వీస్‌ను సురేశ్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీసును నిలబెట్టుకొని 40 నిమిషాల్లో రెండో సెట్‌నూ గెలుచుకున్నాడు. 26ఏళ్ల దక్షిణేశ్వరన్ మొత్తం 33 విన్నర్ షాట్స్, 17 ఏస్‌లను సంధించాడు. ఈ ఏడాది ఆరంభంలో రొలాండ్ గారోస్‌లో సిన్నర్‌ను ఓడించిన జువాన్‌తో సెరుండో తలపడనున్నాడు. ఇక ఆసియా క్రీడలకు భారత టెన్నిస్ జట్టులో దక్షిణేశ్వరన్కు చోటు లభించింది.








కామెంట్లు (0)