- తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం
పెర్త్: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. పెర్త్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 33.4 ఓవర్లలో కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్ర పేసర్ మహ్లీ బార్డ్‌మన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును దెబ్బ తీశాడు. బార్డ్‌మన్ 7.4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడుగా స్పెన్సర్ జాన్సన్ 3 వికెట్లు సాధించాడు. ఒక దశలో 65 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్‌ను అట్కిన్సన్(29), విల్ జాక్స్(25) ఆదుకున్నారు. జో రూట్ (17), బెన్ డకెట్ (9), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1), సామ్ కరన్ (0) నిరాశపరిచారు. అనంతరం 132 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి విజయాన్ని ఖాయం చేశాడు. కూపర్ కొన్నోలీ (27), మాట్ రెన్‌షా (26 నాటౌట్), జోష్ ఇంగ్లిస్ (23 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మ్యాచ్ ముగించారు. దీంతో ఆసీస్ 23.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బార్డ్‌మన్‌కు లభించగా.. రెండో వన్డే అడిలైడ్ ఓవల్ వేదికగా ఆదివారం జరగనుంది.








కామెంట్‌లు (0)