బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా రేపటినుంచి ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్
బ్రూసెల్స్(బెల్జియం): మరో రెండ్రో జుల్లో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ప్రపంచకప్ ప్రారంభం కానుంది. బెల్జియం, నెదర్లాండ్స్ వేదికలుగా జరిగే 16వ హాకీ ప్రపంచకప్‌లో భారత హాకీ జట్లు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. పురుషుల జట్టు తమ ప్రపంచ కప్ పోరాటాన్ని 15న వేల్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో ప్రారంభించనుంది. ఇక మహిళల జట్టు 16న చైనాతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరిగిన పరిణామాల్లో భాగంగా జెర్సీ వివాదం ఒకటి. ఆటగాళ్లు ధరించే జెర్సీ మార్పుకు హాకీ ఇండియా(హెచ్‌ఐ) ఇచ్చిన వివరణపైఆ ఆటగాళ్లతోపాటు, అధ్యక్షులు దిలీప్ టిర్కే సైతం తప్పుబట్టారు. జట్టు సన్నద్ధత కంటే జెర్సీ వివాదం హాట్ టాపింగ్‌గా మారింది. స్జోర్డ్ మారిగ్నే ఆధ్వర్యంలో మహిళల జట్టు ఇటీవలి కాలంలో గణనీయంగా మెరుగుపడింది. 16 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో విజేత ఎవరో ఆగస్టు 30న తెలియనుంది. గ్రూప్-డిలోని భారత జట్టు లీగ్ దశలో చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను ఢీకొట్టనుంది. 16న చైనాతో, 18న దక్షిణాఫ్రికాతో, 20న ఇంగ్లండ్‌తో భారత మహిళల హాకీజట్టు తలపడనుంది. భారత మహిళలజట్టులో లాల్‌తాన్‌త్లువాంగి, శిల్పా దబాస్, ఇషిక చౌదరి, సాక్షి రాణా, సునెలిటా టొప్పో, దీపిక సొరెంగ్, దీపిక, రుతుజ, ఇషిక, బల్జీత్ కౌర్, బ్యూటీలకు ప్రపంచకప్‌లో ఆడడం ఇదే తొలిసారి. గోల్ కీపర్ సవిత ఆడిన అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 313. జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలు సవితనే. సవితతో పాటు నవ్‌నీత్ కౌర్, నికీ ప్రధాన్, నేహా, లాల్‌రెమ్‌సియామిలకు అత్యధికంగా 3 ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం ఉంది. పూల్-డిలో చైనా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా నుంచి సలీమా బృందానికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ మూడు జట్లపై మెరుగైన ప్రదర్శన చేసి ముందంజ వేయడం భారత్‌కు పెద్ద సవాల్. 1974 ప్రపంచకప్ హాకీ తొలి టోర్నీలోనే భారత్ అదిరే ప్రదర్శన చేసింది. అజందర్ కౌర్ సారథ్యంలోని జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లి ట్రోఫీపై ఆశలు రేపింది. అయితే సెమీస్‌లో ఓడి.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2018లో రాణి రాంపాల్ కెప్టెన్సీలో క్వార్టర్స్ వరకు వెళ్లడం భారత్‌కు ఉత్తమ ప్రదర్శనల్లో ఒకటి. క్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లో ఐర్లాండ్ చేతిలో ఓడింది. గత అయిదు టోర్నీల్లో ఇదే భారత్‌కు ఉత్తమ ప్రదర్శన. చివరగా 2022 టోర్నీలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. మహిళల ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఎదురునిలిచే జట్లు కనిపించడంలేదు. 15 సార్లు ప్రపంచకప్ జరగ్గా... నెదర్లాండ్స్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా, ఆ్రస్టేలియా, జర్మనీ రెండుసార్లు చొప్పున టైటిల్ అందుకున్నాయి.
మరోవైపు పురుషుల జట్టు పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఒలింపిక్స్ భారతజట్టు పతకం సాధించడమే. దీంతో భారత పురుషుల హాకీ జట్టుపై అంచనాలు అమాంతం పెరిగాయి. 1971లో కాంస్యం, 1973లో రజత పతకం సాధించిన భారత్.. 1975లో ఏకంగా స్వర్ణ పతకం సాధించింది. ఆ తర్వాత భారతజట్టు ఆ స్థాయి ప్రదర్శనను చూపలేదు. ఇటీవలికాలంలో యూరోప్ జట్ల ఆధిపత్యం పెరిగింది. ఇప్పటి వరకు పురుషుల, మహిళల ప్రపంచకప్ టోర్నీలు 15 జరగ్గా.. పురుషుల విభాగంలో పాకిస్తాన్ జట్టు అత్యధికంగా నాలుగుసార్లు విజేతగా నిలిచింది. నెదర్లాండ్స్, జర్మనీ, ఆ్రస్టేలియా జట్లు మూడుసార్లు చొప్పున టైటిల్ అందుకోగా... భారత్, బెల్జియం జట్లు ఒక్కోసారి విన్నర్స్ ట్రోఫీని ముద్దాడాయి. ఈసారి టైటిల్ ఫేవరేట్‌గా నెదర్లాండ్స్, జర్మనీ జట్లు బరిలోకి దిగుతున్నాయి. జర్మనీ డిఫెండింగ్ చాంపి యన్‌గా బరిలోకి దిగుతోంది. ఆతిథ్య నెదర్లాండ్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. స్వంత అభిమానుల మధ్య చెలరేగడం ఖాయం.








కామెంట్‌లు (0)