క్వార్టర్‌ఫైనల్లో ఓడిన అస్మిత
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పారిస్: ప్రెంచ్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం నమోదు చేసిన అస్మిత చాలీహా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగియగా.. స్టార్ షట్లర్ పివి సిందు సెమీఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అస్మిత 10-21, 21-17, 16-21తో నజోమీ ఒకుహరా(జపాన్) చేతిలో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓటమిపాలైంది. తొలిరౌండ్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్‌ను యమగుచిని చిత్తుచేసిన అస్మిత క్వార్టర్‌ఫైనల్లోనూ అదేస్థాయి ప్రదర్శనను కనబర్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ సుమారు గంటపాటు సాగింది. మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పివి సింధు 21-13, 21-14తో చైనీస్ తైపీకి చెందిన ఛౌ-పిన్-చెన్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 39 నిమిషాల్లోనే ముగించింది.







కామెంట్‌లు (0)