ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హాకీలో అమ్మాయిలు హ్యాట్రిక్‌

20 గంటల క్రితం

hockey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 11:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వరుసగా మూడోసారి ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం

  • ఫైనల్లో చైనాపై 3-1గోల్స్‌తో గెలుపు

భోపాల్‌: ఆసియా హాకీ మహిళల ఛాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌ వరుసగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడి హ్యాట్రిక్‌ కొట్టింది. బార్ఖేడే నాథూ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్లో భారత మహిళలజట్టు 3-1గోల్స్‌ తేడాతో పటిష్ట చైనాను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 0-1తో చైనాకంటే వెనుకబడింది. కానీ రెండో అర్ధభాగంలో వరుసగా మూడో గోల్స్‌ కొట్టి విజయాన్ని నమోదు చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్‌ పోరులో చైనా తరఫున చెన్‌ యూ జెన్‌(24వ ని.) ఒక గోల్‌ చేయడంతో చైనా ఆధిక్యతలో నిలిచింది. ఇక రెండో అర్ధభాగం దీపిక (38వ ని.), (43వ ని.) రెండు గోల్స్‌ చేయగా.. ఇషిక 42వ ని.లో ఒక గోల్‌ చేసింది. దీంతో భారత్‌ 3-1 ఆధిక్యతలో నిలిచింది. చివరి 15 నిమిషాల్లో భారత డిఫెండర్లు సమర్ధవంతంగా నిలువరించడంతో భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది. హాకీ ఇండియా(హెచ్‌ఐ) గోల్డెన్‌ జూబ్లీ(వందేళ్లు) సందర్భంగా ఈ టోర్నమెంట్‌ జరిగింది.

జపాన్‌కు కాంస్యం

ఉత్కంఠభరితంగా సాగిన కాంస్య పతక పోరులో జపాన్‌ జట్టు 5-2గోల్స్‌తో మలేషియాను ఓడించింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇరుజట్లు 2-2గోల్స్‌తో సమంగా ఉన్నా రెండో అర్దభాగంలో జపాన్‌ మరో మూడు గోల్స్‌ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్