హాంగ్‌జౌలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో భారత యువ షూటర్ ఇషా సింగ్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 40 హిట్లు నమోదు చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది.కాంస్య పతకం కోసం షూట్‌ఆఫ్ వరకు పోరాడిన మనూ బాకర్, చివరకు 28 హిట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత షూటర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. మనూ బాకర్ 586-20x స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా, 21 ఏళ్ల ఇషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఫైనల్లో అసాధారణ ప్రదర్శన చేసిన ఇషా సింగ్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
హాంగ్‌జౌలో ఇషా సింగ్‌కు స్వర్ణం.. మనూ బాకర్‌కు కాంస్యం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 06:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)