పారిస్ : ఐరోపా దేశాలను వణికిస్తున్న కార్చిచ్చు ఫ్రాన్స్‌లోని బోర్డో నగరంవైపు దూసుకువస్తోంది. ఈ మంటలను అదుపుచేసేందుకు ఆదివారం రాత్రి నుండి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్ల అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూరప్‌లో ఒకవైపు తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరోవైపు కార్చిచ్చు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో సుమారు 2,20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు. అలాగే స్పెయిన్‌లో 75,000 మందికి పైగా ప్రజలను తరలించామని, మరో 30,000 మందిని అదే ప్రాంతంలో సురక్షితంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ ఇంత స్థాయిలో ప్రమాదాన్ని చూడలేదని సెస్టాస్ మేయర్ జెరోమ్ స్టెఫ్ఫే అన్నారు. బోర్డో నగరానికి అనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో సెప్టాస్ ఒకటని, ఇక్కడి ఇళ్లు, కాటేజీల నుండి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. గత వారం అట్లాంటిక్ తీరం సమీపంలో చెలరేగిన ఈ మంటలు, ప్రస్తుతం బోర్డో నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని అన్నారు. ఈ వారం చివరలో బోర్డోలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని ఫ్రాన్స్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కార్చిచ్చుపై మాక్రాన్ ప్రభుత్వం నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చించనుంది.
బోర్డోకు 15 కి.మీ దూరంలో మంటలు.. అప్రమత్తమైన ఫ్రాన్స్ ప్రభుత్వం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 06:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)