బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హార్దిక్‌ పాండ్య పంజాబ్‌కు .. ముంబయికి అర్ష్‌దీప్‌ సింగ్‌

6 గంటల క్రితం

Hardik Pandya to Punjab Arshdeep Singh to Mumbai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐపిఎల్ : ఐపిఎల్‌ 2027 సీజన్‌కు ముందే ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య కీలక ఆటగాళ్ల మార్పిడి జరిగింది. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పంజాబ్‌ కింగ్స్‌కు వెళ్లగా.. పంజాబ్‌ జట్టు ప్రధాన పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ముంబయి జట్టులో చేరారు. ఈ ట్రేడ్‌కు ఐపిఎల్‌ యాజమాన్యం బుధవారం అధికారికంగా ఆమోదం తెలిపింది.


ఈ ఒప్పందంలో భాగంగా హార్దిక్‌ పాండ్య ధర రూ.16.35 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెరిగింది. పంజాబ్‌ కింగ్స్‌ అతడిని రూ.18 కోట్లకు తీసుకునేందుకు అంగీకరించింది. మరోవైపు అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా తన ప్రస్తుత ధర రూ.18 కోట్లతోనే ముంబయి ఇండియన్స్‌లో కొనసాగనున్నారు. పంజాబ్‌లో హార్దిక్‌ పాండ్య శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలో ఆడనున్నారు.


2015లో ఐపీఎల్‌ ప్రస్థానాన్ని ముంబయి ఇండియన్స్‌తో ప్రారంభించిన హార్దిక్‌ ఆ జట్టు నాలుగు టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు మారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టారు. తొలి ఏడాదే జట్టుకు ఛాంపియన్‌షిప్‌ అందించారు. 2024లో తిరిగి ముంబయికి చేరి సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దీంతో అతడిని ట్రేడ్‌ చేయాలని ముంబయి యాజమాన్యం నిర్ణయించింది. ఐపిఎల్‌లో ఇప్పటివరకు 162 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్‌ 2,955 పరుగులు చేయడంతో పాటు 82 వికెట్లు పడగొట్టాడు. అతడి స్ట్రయిక్‌ రేటు 146.28గా ఉంది.


అర్ష్‌దీప్‌ సింగ్‌ విషయానికొస్తే ... ఐపిఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరఫునే అరంగేట్రం చేసి, ఎనిమిదేళ్లుగా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన ఎడమచేతి వాటం పేస్‌ బౌలింగ్‌తో జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు పొందారు. 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు తీసి పంజాబ్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. అతడిని వదులుకోవడానికి పంజాబ్‌ తొలుత ఆసక్తి చూపకపోయినా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, కోచ్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయంతో ఈ ట్రేడ్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్