లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత జెన్నిక్ సిన్నర్ 35 లక్షల పౌండ్లు (రూ. 46 కోట్లు) ప్రైజ్ మనీ అందుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో టాప్‌సీడ్, ఇటలీకి చెందిన సిన్నర్ మూడు గంటల 46 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో 6–7 (7/9), 7–6 (7/2), 6–3, 6–4తో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. గత ఏడాది కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్)పై నాలుగు సెట్‌ల హోరా హోరీ పోరులో విజయం సాధించిన సిన్నర్.. ఈ ఏడాది కూడా ఫైనల్ పోరులో నాలుగు సెట్‌లలోనే విజయం సాధించడం విశేషం. రన్నరప్ జ్వెరెవ్‌కు 18 లక్షల పౌండ్లు (రూ. 23 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. పదో ప్రయత్నంలో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన జ్వెరెవ్ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి జోరు మీద ఉన్నట్లు కనిపించినా..రెండో సెట్‌ను టైబ్రేక్‌లోఓడాడు. సిన్నర్‌కు ఇది ఐదో గ్రాండ్‌స్లామ్.
Print Editionవింబుల్డన్ టైటిల్ విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే...?
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)