మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజెర్సీ మార్పుపై వెనక్కి తగ్గిన హాకీ ఇండియా

1 గంట క్రితం

hokey india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆసియా క్రీడల్లో బ్లూ జెర్సీతోనే...

భువనేశ్వర్‌: ఎఫ్‌ఐహెచ్‌ హాకీ ప్రపంచకప్‌‌లో భారత ఆటగాళ్లు ధరించిన (కాషాయ)జెర్సీ పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో హాకీ ఇండియా(హెచ్‌ఐ) వెనక్కి తగ్గింది. జపాన్‌ ‌వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో హాకీ ఆటగాళ్లు ధరించే పాత (బ్లూ) జెర్సీనే కొనసాగించనున్నట్లు ప్రకటించింది. హాకీ ఆటగాళ్లు తొలిఎంపికగా బ్లూ జెర్సీని ఎన్నుకున్నారని, రెండో ప్రత్యామ్నాయంగా కాషాయ జెర్సీని కోరుకున్నట్లు హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) హాకీ ఆటగాళ్లు ఏ కిట్ ధరించనున్నారు అంటూ తమను కోరిందని, దానికి హాకీ ఇండియా మొదటి ప్రాధాన్యతగా నీలం రంగును, రెండవ రంగుగా కాషాయాన్ని ధరించనున్నట్లు సమాచారం ఇచ్చిందని హాకీ ఇండియా కార్యవర్గ సభ్యుడు ఒకరు తెలిపినట్లు తెలిసింది. ఈ నిర్ణయంపై అధ్యక్షులు దిలీప్‌ ‌టిర్కే మాట్లాడుతూ.. కాషాక రంగు జెర్సీ శాశ్వతమని ఎన్నడూ చెప్పలేదని, జెర్సీ సమాచారంపై అందరూ ఒక అభిప్రాయానికి వస్తే మంచిదని తెలిపినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపంచకప్‌‌లో భారత జట్టు నిరాశపరిచింది. ముఖ్యంగా పురుషుల జట్టు 8వ స్థానంలో నిలువగా.. మహిళలజట్టు 5వ స్థానంలో నిలిచి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన విషయం తెలిసిందే. జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్‌ 16 ‌నుంచి అక్టోబర్‌ 4‌వరకు 2026 ఆసియా క్రీడలు జరగనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్