క్రీడలు : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్ ఆసిఫ్ ఖాన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కఠిన చర్యలు తీసుకుంది. డోపింగ్ పరీక్షలో విఫలమైన కారణంగా అతడిపై 15 నెలల పాటు నిషేధం విధించింది. 2025 సెప్టెంబర్ 8న ఆసిఫ్ ఖాన్‌కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నిషేధిత పదార్థమైన మ్యాస్టెరోలోన్ మెటాబోలైట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై స్పందించిన ఆసిఫ్ ఖాన్.. తాను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నట్లు అంగీకరించారు. అయితే మ్యాచ్‌లు లేని సమయంలో, అంటే అవుట్ ఆఫ్ కాంపిటీషన్‌లో దీనిని వినియోగించినట్లు తెలిపారు. అయితే క్రీడాకారులు నిషేధిత డ్రగ్స్‌ను వినియోగించడంపై ఉన్న నిబంధనల ప్రకారం ఐసిసి అతడిపై చర్యలు తీసుకుంది. ఆసిఫ్ ఖాన్‌పై విధించిన 15 నెలల నిషేధం 2025 సెప్టెంబర్ 8 నుంచే అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 7 తర్వాత అతడిపై ఉన్న నిషేధం ముగియనుంది. నిషేధ కాలంలో అతడు సాధించిన వ్యక్తిగత రికార్డులు, అందుకున్న ప్రైజ్‌మనీని కూడా రద్దు చేయనున్నట్లు వెల్లడైంది. ఆసిఫ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో యూఏఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు యూఏఈ తరఫున 38 వన్డేలు, 56 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తం 2,572 పరుగులు సాధించారు. చివరిసారిగా 2025లో యూఏఈ జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)