సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ vs IND : మూడో రోజు ఆట వర్షార్పణం ..!

7 గంటల క్రితం

IND vs NZ Play called off due to rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 01:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వర్షం కారణంగా మూడో రోజు ఆట రద్దు

  • భారత్‌ ‘ఎ’ భారీ స్కోరు.. కివీస్‌ 428 పరుగుల వెనుకంజ


న్యూజిలాండ్ : న్యూజిలాండ్‌-భారత్‌ ‘ఎ’ జట్ల మధ్య జరుగుతున్న మూడో అనధికారిక టెస్టులో వర్షం కారణంగా మూడో రోజు ఆట పూర్తిగా రద్దయింది. లింకన్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం మూడో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో భారీ ఆధిక్యంతో ఉన్న భారత్‌పై ఒత్తిడి పెంచే అవకాశం న్యూజిలాండ్‌కు దక్కలేదు.


బ్యాటర్ల సమష్టి ప్రదర్శన ...

టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 102 పరుగులతో శతకం నమోదు చేయగా, సాయి సుదర్శన్‌ 88 పరుగులతో ఆకట్టుకున్నాడు. దేవదత్‌ పడిక్కల్‌ 15 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్‌ ధ్రువ్‌ జురెల్‌ 71, తిలక్‌ వర్మ అజేయంగా 81 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. రవీంద్ర జడేజా 25 పరుగులు చేయగా, వాషింగ్టన్‌ సుందర్‌ అజేయంగా 50 పరుగులు సాధించాడు. దీంతో భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 464 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జాక్‌ గిబ్సన్‌ రెండు వికెట్లు తీయగా, జారోడ్‌ మెకాయ్‌, కామెరాన్‌ పాల్‌, డనురు ఫెర్న్స్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.


కివీస్‌ను దెబ్బతీసిన ప్రసిద్‌ కృష్ణ ...

భారత తొలి ఇన్నింగ్స్‌ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను భారత పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ ఇబ్బందుల్లోకి నెట్టాడు. రైస్‌ మరియును డకౌట్‌ చేయడంతో పాటు కర్టిస్‌ హీపీని 19 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌ 10, జాక్‌ గిబ్సన్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.


వర్షంతో నిలిచిన మ్యాచ్‌ ...

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుతో పోలిస్తే న్యూజిలాండ్‌ ఇంకా 428 పరుగులు వెనుకబడి ఉంది. అయితే మూడో రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఆట నిర్వహణ సాధ్యపడలేదు. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో న్యూజిలాండ్‌ 428 పరుగుల భారీ లోటుతోనే కొనసాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్