జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
టోక్యో: జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పివి సింధు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో సింధు వరుససెట్లలో 5వ సీడ్, చైనాకు చెందిన హన్ యూను ఓడించింది. ఈ టోర్నీలో సింగిల్స్‌లో మిగిలిన ఏకైక షట్లర్ సింధు ప్రీ క్వార్టర్స్‌లో 21-16, 21-14తో హన్ యూను చిత్తుచేసింది. క్వార్టర్ ఫైనల్లో సింధు.. జపాన్‌కు చెందిన టాప్‌సీడ్ ఒకుహరాతో తలపడనుంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్ కపిల, తానీసా కాస్ట్రో జంట 20-22, 17-21తో టాప్‌సీడ్, చైనాకు చెందిన పెంగ్ యాన్-యంగ్ డాంగ్ చేతిలో పోరాడి ఓడారు.







కామెంట్‌లు (0)