శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి

2 గంటల క్రితం

sen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ
హాంకాంగ్‌: హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరి టైటిల్‌పై ఆశలు రేపిన లక్ష్యసేన్, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఓటమిపాలయ్యారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో లక్ష్యసేన్ 13-21, 13-21తో 3వ ర్యాంకర్‌, డెన్మార్క్‌కు చెందిన ఆంటోన్సెన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ మ్యాచ్‌ కేవలం 42 నిమిషాల్లోనే ముగిసింది. ఇక పురుషుల డబుల్స్‌లో 5వ ర్యాంకర్‌ జంట సాత్విక్‌-చిరాగ్‌ 18-21, 19-21తో మలేషియాకు చెందిన 8వ ర్యాంకర్‌ జంట ఛోంగ్‌, టిన్‌-కి చేతిలో వరుససెట్లలో పరాజయం పాలయ్యారు. ఈ గేమ్‌ కూడా కేవలం 41 నిమిషాల్లోనే ముగిసింది. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన 5వ ర్యాంకర్‌ ఛోఛువాంగ్‌, టాప్‌సీడ్‌, చైనాకు చెందిన వాంగ్‌-జీ-హి ప్రవేశించారు. వాంగ్‌ 21-15, 21-15తో 4వ ర్యాంకర్‌, జపాన్‌కు చెందిన మియాజాకీ చేతిలో, ఛో ఛువాంగ్‌ 21-16, 18-21, 21-13తో తన దేశానికే చెందిన 3వ ర్యాంకర్‌ ఇంటనాన్‌పై విజయం సాధించింది. ఇక పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి ఆంటోన్సెన్‌కి తోడు 2వ ర్యాంకర్‌, థాయ్‌లాండ్‌కు చెందిన విదిత్‌శరణ్‌ ప్రవేశించారు. విదిత్‌ 18-21తో తొలి గేమ్‌ చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-15, 21-16తో ఇండోనేషియాకు చెందిన ఉబాదుల్లాను ఓడించి టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్