బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Lovlina - చరిత్ర సృష్టించిన లవ్లీనా.. ఆసియా స్వర్ణం కైవసం ..!

02 అక్టోబర్, 2026

Lovlina creates history... clinches Asian gold!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 01:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఆసియా క్రీడలు-2026 లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. తన 29వ పుట్టినరోజున మహిళల 75 కేజీల ఫైనల్లో చైనా బాక్సర్‌ బావో జియిపై 5-0 తేడాతో విజయం సాధించారు. దీంతో ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా చరిత్ర సృష్టించారు. గతంలో మేరీ కోమ్‌ ఈ ఘనత సాధించారు. నిషియో జిమ్నాసియంలో జరిగిన ఫైనల్లో తొలి రౌండ్‌ను 3-2తో గెలిచిన లవ్లీనా.. తర్వాతి రెండు రౌండ్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. రెండు రౌండ్లను 4-1తో గెలుచుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, 2026 కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సాధించిన ఆమె.. తాజాగా ఆసియా స్వర్ణాన్ని తన ఖాతాలో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా .... పురుషుల విభాగంలో అంకుశ్‌, మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్‌ హుడా ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అంకుశ్‌ 4-1తో, పర్వీన్‌ హుడా 5-0తో విజయం సాధించారు. శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో వీరిద్దరూ స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్