mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

TG-20 లో వరంగల్‌తో మ్యాచ్‌.. నల్గొండ బ్యాటింగ్

9 గంటల క్రితం

Match against Warangal in TG-20... Nalgonda batting.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 02:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : తెలంగాణ టి 20-2026లో వరంగల్‌ వారియర్స్‌, నల్గొండ నైట్స్‌ మధ్య పోరు కొనసాగుతోంది. శుక్రవారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వరంగల్‌ వారియర్స్‌ జట్టు ముందుగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయించింది. దీంతో నల్గొండ నైట్స్‌ బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఇప్పటికే రెండేసి మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు జట్లు చెరో విజయంతో పాటు చెరో పరాజయాన్ని నమోదు చేశాయి. వరంగల్‌ వారియర్స్‌ రెండు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉండగా, నెట్‌రన్‌రేట్‌లో వెనుకబడిన నల్గొండ నైట్స్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది.


తుది జట్లు ...

నల్గొండ నైట్స్‌ : ప్రణవ్‌ సూర్యదేవర, గౌరవ్‌ రెడ్డి, నితీశ్‌ రెడ్డి, రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), దివేశ్‌ సింగ్‌, ఎండీ అర్ఫాజ్‌ అహ్మద్‌, టి. హర్షవర్దన్‌ సింగ్‌, అనికేత్‌ రెడ్డి, వరుణ్‌ గౌడ్‌, రక్షణ్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను.

వరంగల్‌ వారియర్స్‌ : అమన్‌ రావు (కెప్టెన్‌), హర్షిత్‌ చౌదరి, రిషికేత్‌ సిసోడియా, భవేశ్‌ సేత్‌, మురుగన్‌ అభిషేక్‌, ఆది మణి కిరణ్‌, ఆసిఫ్‌ మన్సూరి, క్రాంటి పల్లెపాటి, మహ్మద్‌ అబ్దుల్‌ మాలిక్‌, ముదస్పర్‌ హుసేన్‌, శౌనక్‌ కులకర్ణి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్