శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు.. చరిత్ర సృష్టించిన జో రూట్‌

1 గంట క్రితం

Most Test runs on home soil... Joe Root creates history.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 03:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లార్డ్స్‌ : పాకిస్తాన్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా రూట్‌ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే వెనుదిరిగిన రూట్‌, రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోలేకపోయారు. 24 పరుగులు చేసిన అతడు మహ్మద్‌ అలీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగారు. అయితే .... ఈ మ్యాచ్‌లో రూట్‌ 16 పరుగుల వ్యక్తిగత స్కోరును చేరుకున్న సమయంలోనే సొంత గడ్డపై అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ రికార్డును అధిగమించారు. ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు రూట్‌ 7,594 టెస్టు పరుగులు సాధించారు. ఆస్ట్రేలియాలో పాంటింగ్‌ 7,578 పరుగులు చేశారు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ 7,216 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్దనే 7,167 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. దీంతో రూట్‌ సేనకు ప్రస్తుతం 261 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో మ్యాచ్‌పై ఇంగ్లండ్‌ పట్టు మరింత బిగించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్