శనివారం, 14 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకిస్తాన్‌-శ్రీలంక తొలి టెస్ట్‌ డ్రా

7 గంటల క్రితం

pak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రావల్పిండి: పాకిస్తాన్‌, శ్రీలంక జట్ల మధ్య రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్‌ డ్రా అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 57 పరుగులతో చివరిరోజైన శుక్రవారం ఆటను కొనసాగించిన పాకిస్తాన్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్డ్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటింగ్‌కు నిరాకరించడంతో ఈ టెస్ట్‌ను డ్రాగా అంపైర్లు ప్రకటించారు. షౌద్‌ షకీల్‌(97), ఘాజి ఘోరి(35), కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(34) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. శ్రీలంక బౌలర్లు రత్నాయకేకు మూడు, ఫెర్నాండో, లాహిరుకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షాకిబ్‌ ఖాన్‌కు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో, చివరి టెస్ట్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్