శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2nd ODI - రెండో వన్డే పై రెయిన్ ఎఫెక్ట్ - టీమిండియా ప్రాక్టీస్ క్యాన్సిల్ ..!

1 గంట క్రితం

Rain affects the second ODI Team Indias practice session cancelled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూజిలాండ్ : న్యూజిలాండ్‌, భారత్ జట్ల మధ్య శనివారం జరగనున్న రెండో వన్డేకు వర్షం అడ్డంకిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెల్లింగ్టన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భారత జట్టు ప్రాక్టీస్‌ సెషన్‌ను రద్దు చేసుకుంది. మరోవైపు సిరీస్‌లో వెనుకంజలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టు ఇండోర్‌ స్టేడియంలో సాధన చేసింది. మ్యాచ్‌ జరిగే సమయంలోనూ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


ఇప్పటికే తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో రెండుసార్లు లక్ష్యాన్ని సవరించాల్సి వచ్చింది. అయినప్పటికీ టీమిండియా విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.


సిరీస్‌కు దూరమైన డేవన్ కాన్వే ....

తొలి వన్డేకు ముందు ప్రాక్టీస్‌ సమయంలో గాయపడిన న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డేవన్‌ కాన్వే ఆ మ్యాచ్‌కు దూరమయ్యారు. తాజాగా గాయం కారణంగా మొత్తం సిరీస్‌ నుంచే వైదొలిగారు. అతడి స్థానంలో నిక్‌ కెల్లీని కంకషన్‌ ప్రత్యామ్నాయ ఆటగాడిగా జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు కాన్వేతో కలిసి ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడిన మ్యాట్‌ హెన్రీ కోలుకున్నారు. అతడు రెండో వన్డేకు ఎంపికకు అందుబాటులో ఉన్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్