ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Asian games : క్రికెట్‌లో సెమీస్‌కు భారత్‌, పాకిస్తాన్‌

28 సెప్టెంబర్, 2026

Asian Sport - Rain Effect - Match Cancelled
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • భారీ వర్షంతో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచులు రద్దు

క్రికెట్‌ ఆసియా క్రీడల పురుషుల క్రికెట్‌లో టీమిండియా జ‌ట్టు ఒక్క బంతి కూడా ఆడ‌కుండానే సెమీస్‌కి చేరింది. భార‌త్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ జట్ల మధ్య సోమ‌వారం జరగాల్సిన క్లార్ట‌ర్ ఫైన‌ల్స్ జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ వ‌రుణుడి దెబ్బ‌కు టాస్ ప‌డ‌కుండానే ర‌ద్ధైంది. దీంతో నిబంధనల ప్రకారం ఐసిసి టి20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే భార‌త్ సెమీఫైన‌ల్‌లో శ్రీలంక/నేపాల్‌ మ్యాచ్‌ విజేతతో తలపడనుంది. భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు ముందు ఇదే మైదానంలో పాకిస్థాన్-హాంకాంగ్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ కూడా వర్షం కారణగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దయ్యింది. దీంతో పాకిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు చేరింది. పాకిస్థాన్, హాంగ్‌కాంగ్ మధ్య సోమవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు భారీ వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. నిషీన్‌లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ క్వార్టర్ ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం భారీ వర్షం కురవడంతో మైదానం ఆటకు అనుకూలంగా లేకుండా పోయింది. వర్షం తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో అంపైర్లు, మ్యాచ్ అధికారులు చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో మెరుగైన సీడింగ్ ఉన్న పాకిస్థాన్‌కు సెమీ ఫైనల్ బెర్త్ దక్కింది. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్/మలేషియా మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో పాకిస్థాన్ తలపడనుంది. ఈ టోర్నీ ఫార్మాట్‌లో టాప్ సీడింగ్ పొందిన భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశం లభించాయి. గత ఏడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడలో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకంతో మెరిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్