శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionJapan Open: సెమీఫైనల్లో సింధు

1 గంట క్రితం

sindhu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 07:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 750

టోక్యో (జపాన్‌) : భారత అగ్రశ్రేణి షట్లర్‌, రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పి.వి సింధు 2023 తర్వాత తొలిసారి బిడబ్ల్యూఎఫ్‌ టూర్‌ సూపర్‌ 750 టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. జపాన్‌ ఓపెన్‌లో నిలకడగా రాణించిన పి.వి సింధు మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో శుక్రవారం లోకల్‌ స్టార్‌ నవొమి ఒకుహరతో పి.వి సింధు క్వార్టర్‌ఫైనల్లో తలపడాల్సి ఉండగా, ఫిట్‌నెస్‌ సమస్యతో జపాన్‌ అమ్మాయి పోటీ నుంచి తప్పుకుంది. దీంతో రాకెట్‌ పట్టకుండానే, కోర్టులోకి అడుగుపెట్టకుండానే పి.వి సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనా స్టార్‌ చెన్‌ యుఫెయ్‌తో సింధు పోటీపడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్