గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionSinquefield Cup: ప్రజ్ఞానంద 28ఎత్తుల్లోనే గెలుపు

18 గంటల క్రితం

pragnanada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సింక్‌ఫీల్డ్ కప్‌లో అదరగొట్టిన యువ గ్రాండ్‌‌మాస్టర్‌

చెన్నై: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సింక్‌ఫీల్డ్ కప్‌లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన రౌండ్‌-8లో ఫ్రాన్స్‌కు చెందిన మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్‌పై కేవలం 28 ఎత్తుల్లోనే విజయం సాధించి టోర్నీలో సంయుక్తంగా అగ్రస్థానంలోకి ఎగబాకాడు. పెనాల్టిమేట్ రౌండ్‌లో లాగ్రేవ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద 8 రౌండ్లు ముగిసేసరికి 5 పాయింట్లు నిలిచాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సో కూడా 5 పాయింట్లతో ప్రజ్ఞానందతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఫలితంతో ప్రజ్ఞానంద ఈ ఏడాది చివర్లో జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు అర్హత కూడా ఖాయం చేసుకున్నాడు. ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ కూడా అద్భుత ఫామ్‌లోకి వచ్చాడు. డచ్ ఆటగాడు జోర్డెన్ వాన్ ఫోరెస్ట్‌పై విజయం సాధించి వరుసగా మూడో గేమ్ గెలిచాడు. దీంతో సిందరోవ్ 4.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ టాప్ సీడ్ అమెరికన్ ఫాబియానో కరువానాను ఓడించి 4.5 పాయింట్లతో సిందరోవ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నారు. మరో మ్యాచ్‌లో అమెరికాకు చెందిన లెవోన్ అరోనియన్, నెదర్లాండ్స్‌కు చెందిన అనిష్ గిరి డ్రా చేసుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి చివరి రౌండ్‌పైనే ఉంది. ప్రజ్ఞానంద తెల్ల పావులతో అనిష్ గిరితో తలపడనున్నాడు. మరో కీలక పోరులో సిందరోవ్, వెస్లీ సోను ఎదుర్కోనున్నాడు. ఇక కీమర్.. వాన్ ఫోరెస్ట్‌తో ఆడనున్నాడు. కీమర్ విజయం సాధిస్తే అతడూ అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. 5 పాయింట్లతో ప్రజ్ఞానంద, వెస్లీ సో సంయుక్త ఆధిక్యంలో ఉండగా.. చివరి రౌండ్ ఫలితాలు సింక్‌ఫీల్డ్ కప్ విజేతను నిర్ణయించనున్నాయి. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద ఐదు పాయింట్లతో ఈ ఏడాది చివర్లో జరిగే గ్రాండ్‌ ‌ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్