క్రీడలు : శ్రీలంక, భారత్ మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. గాలె వేదికగా తొలి టెస్టు జరగనుండగా.. ఈ నెల 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు కోసం శ్రీలంక బుధవారం 16 మందితో జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ధనుంజయ డి సిల్వా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కమిందు మెండిస్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఇక అటు భారత జట్టుకు మరో ఊహించని షాక్ తగిలింది. వాష్టింగన్ సుందర్ కు గాయం తగ్గకపోవడంతో అతడిని ఈ సిరీస్ నుంచి పూర్తిగా తప్పించారు.
శ్రీలంక జట్టు ..... ధనంజయ డి సిల్వా (కెప్టెన్), లాహిరు ఉదానా, నిషాన్ మదుష్క, కమిందు మెండిస్ (వైస్ కెప్టెన్), దినేష్ చండిమాల్, పసిందు సూరియ బండార, సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా, రమేష్ మెండిస్, ప్రబాత్ జయసూర్య, కేశర నువంత, మిలన్ రత్నాయక్, అసిత ఫెర్నాండో, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, దిల్షన్ మదుశంక.








కామెంట్‌లు (0)