శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionCommonwealth Games: స్విమ్మింగ్‌లో సెమీస్‌‌కు శ్రీహరి

8 గంటల క్రితం

33.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గ్లాస్గో: కామన్వెల్త్‌ ‌క్రీడల రెండోరోజూ భారత్‌ పతకాల ఖాతా తెరవలేదు. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజన్‌కి తోడు పారా లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్ల్లు పతకంపై ఆశలు రేపుతున్నారు. శుక్రవారం జరిగిన 50మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ‌సెమీఫైనల్లోకి శ్రీహరి నటరాజన్‌ ‌ప్రవేశించాడు. క్వాలిఫికేషన్‌ ‌రౌండ్‌‌లో శ్రీహరి 25.52సెకన్లలో గమ్యానికి చేరి 40మంది స్విమ్మర్లు పాల్గొన్న బ్యాక్‌‌స్ట్రోక్‌ ‌స్విమ్మింగ్‌‌లో 14వ స్థానంతో సెమీస్‌కు చేరాడు. ఈ హీట్‌‌లో దక్షిణాఫ్రికాకు చెందిన పీటర్స్‌ ‌కొర్ట్జ 24.45సెకన్లలో గేమ్స్‌ ‌రికార్డును నెలకొల్పాడు. ఇక రువార్డ్‌ ‌వాన్‌ ‌రెనెన్‌(24.78సెకన్లు), హెన్రీ అలన్‌(25.09సెకన్లు) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. నాల్గో హీట్‌‌లో పాల్గొన్న శ్రీహరి 25.78సెకన్లతో 5వ స్థానంలో నిలిచి సెమీస్‌‌కు చేరాడు.

tulika maan

తులిక మాన్‌పై సస్పెన్షన్ వేటు

భారత జూడో ప్లేయర్, బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత తులిక మాన్‌కు షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షలకు హాజరుకాకపోవడంతో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు తులిక మాన్ దూరం కానుంది. గత 12 నెలల వ్యవధిలో మూడు సార్లు తన ‘వేర్‌ అబౌట్స్’ వివరాలను అందించడంలో విఫలమైనందుకు నాడా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దీంతో భారత జూడో జట్టు నుంచి తులిక పేరును తొలగించారు.

పారా పవర్‌ ‌లిఫ్టింగ్‌‌లో అశోక్‌‌కు పతకం మిస్‌

పారా పవర్‌ ‌లిఫ్టింగ్‌‌ అశోక్‌ ‌తృటిలో పతకం చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పారా పవర్‌ ‌లిఫ్టింగ్‌‌లో అశోక్‌ 205కిలోల బరువు లిఫ్ట్‌ ‌చేసి 4వ స్థానంలో నిలిచాడు. మరో లిఫ్టర్‌ ‌పరమ్‌‌జీత్‌ 179‌కిలోల బరువును ఎత్తి 7వ స్థానానికే పరిమితమయ్యారు. బర్మింగ్‌హామ్ 2022లో భారత్ 61 పతకాలు (22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు) గెలుచుకుని పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్