- డబుల్స్‌లో గాయత్రి-త్రీసా కూడా..
న్యూఢిల్లీ: సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి తాన్వీ శర్మ, డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ ప్రవేశించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో 2వ ర్యాంకర్ తాన్వీ శర్మ 11-21, 21-10, 21-13తో 3వ ర్యాంకర్, భారత్‌కే చెందిన ఉన్నతి హుడాను ఓడించింది. మరో సెమీస్‌లో టాప్‌సీడ్, జపాన్‌కు చెందిన రికో గుంజి అనూహ్యంగా ఓటమిపాలైంది. థాయ్‌లాండ్‌కు చెందిన 4వ ర్యాంకర్ సుపనింద 21-16, 220-22, 21-10తో రికోను చిత్తుచేసింది. సుపరిద, తాన్వీ శర్మల మధ్య ఆదివారం టైటిల్ పోరు జరగనుంది. ఇక మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ త్రీసా-గాయ్రతి 13-21తో తొలి గేమ్‌ను చేజార్చుకున్నా.. ఆ తర్వాత రెండు గేమ్‌లను 21-10, 21-12తో 3వ సీడ్ ఉక్రెయిన్‌కు చెందిన పోలినా-యహనెకాలను ఓడించారు. ఫైనల్లో టాప్‌సీడ్, ఇండోనేషియాకు చెందిన ఇండ్రా-జోక్వీలతో తలపడనున్నారు. ఇక మిక్సడ్ సెమీస్‌లో సాత్విక్ రెడ్డి-రక్షిత జంట పోరాటం ముగిసింది. సెమీస్‌లో సాత్విక్-రక్షిత 17-21, 18-21తో మలేషియాకు చెందిన వూయ్-హీ, వమ్నేల చేతిలో ఓటమిపాలయ్యారు.








కామెంట్‌లు (0)