శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోహిత్‌, కోహ్లిలకు పరీక్ష‍

58 నిమిషాల క్రితం

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 10:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేడు వెస్టిండీస్‌తో తొలి వన్డే

- మ. 2.00గం.ల నుంచి

తిరువనంతపురం: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ సన్నాహాంలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగే తొలి వన్డేకు సినీయర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లితోపాటు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫామ్‌పై అందరి దృష్టి నెలకొంది. వీరంతా వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నారు. టెస్టు, టి20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన విరాట్‌, రోహిత్‌ కేవలం వన్డేల్లో మాత్రమే పాల్గొంటున్నారు. మరోవైపు భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన విండీస్‌ జట్టు ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీంతో ఐసిసి ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌-8లో చోటు కోల్పోయి నేరుగా ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు దూరమైంది. శుక్రవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌లో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతి గిల్ కుడి మోచేతికి బలంగా తాకడంతో గాయపడ్డ గిల్‌ ప్రాథమిక చికిత్స తర్వాత కోలుకోవడం శుభపరిణామం. ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌తో పాటు ఐదు టి20ల సిరీస్‌ జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్