మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionUS Open: ఒసాకా కష్టంగా..

1 గంట క్రితం

osaka.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 09:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్వైటెక్‌ ‌సునాయాసంగా..

  • యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌‌లో మాజీ నంబర్‌‌వన్‌ ‌క్రీడాకారిణులు, నవోమీ ఒసాకా అతికష్టంమీద గెలుపొందగా.. ఇగా స్వైటెక్‌ ‌సునాయాసంగా తొలిరౌండ్‌ ‌మ్యాచుల్లో గెలిచారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీల్లో 13వ సీడ్‌ ఒసాకా 7-6(8-6), 7-6(7-3)తో అన్‌‌సీడెడ్‌, రష్యాకు చెందిన జఖరోవాపై, 8వ సీడ్‌ ఇగా స్వైటెక్‌ 6-2, 6-3తో వరుససెట్లలో అన్‌‌సీడెడ్‌, చైనాకు చెందిన వాంగ్‌‌పై విజయం సాధించారు. ఇక 29వ సీడ్‌ అమెరికాకు చెందిన లీ 7-5, 6-1తో ఎంటోనియా (క్రొయేషి యా)పై, స్టీఫెన్స్‌ 6-4, 6-1తో టౌసన్‌(‌డెన్మార్క్‌)‌ను ఓడించి రెండోరౌండ్‌‌కు చేరారు. ఇక 6వ సీడ్‌, చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన నొస్కోవా 7-5, 6-1తో వొలినెట్స్‌(అమెరికా), 16వ సీడ్‌, జర్మనీకి చెందిన సర్ట్స్‌‌యా 6-3, 6-0తో ఆస్ట్రియాకు చెందిన గ్రాబర్‌‌ను ఓడించారు.

ఐదుసెట్ల పోరులో...

పురుషుల సింగిల్స్‌‌లో 11వ సీడ్‌, అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్‌ ‌టఫీ ఐదుసెట్ల హోరాహోరీ పోరులో తన దేశానికే చెందిన మార్టిన్‌‌ను చిత్తుచేశాడు. హోరాహోరీగా సాగిన ఈ సంగ్రామంలో టఫీ 6-4, 4-6, 3-6, 6-3, 6-4తో మార్టిన్‌‌ను చిత్తుచేశాడు. ఇక 17వ సీడ్‌, చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన మెన్సిక్‌ 6-1, 6-4, 7-5తో జపాన్‌‌కు చెందిన షింటారోను, 8వ సీడ్‌ ‌షెల్టన్‌(అమెరికా) 1-6, 6-1, 7-6(7-3), 6-2తో అన్‌‌సీడెడ్‌, నెదర్లాండ్స్‌‌కు చెందిన గ్రీక్స్‌‌పూర్‌‌ను ఓడించారు. ఇక 14వ సీడ్‌ ‌టియాన్‌ 6-4, 6-1, 6-2తో బోర్గెస్‌(‌పోర్చుగల్‌)‌పై, 3వ సీడ్‌, అగర్‌(‌కెనడా) 7-5, 4-6, 6-3, 67-5తో హిజికత్‌(ఆస్ట్రేలియా)ను ఓడించారు. ఇక స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్‌ 3 క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్ బోణీ కొట్టాడు. ఐదు నెలల తర్వాత రాకెట్‌ ‌పట్టిన అల్కరాజ్‌ తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన రోమన్ సఫియులిన్‌పై 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్