మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైకేల్ ఫారడే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

1 గంట క్రితం

Michael Faraday's birth anniversary celebrated on a grand scale.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) : ప్రముఖ శాస్త్రవేత్త, విద్యుదయస్కాంతత్వ పితామహుడు మైకేల్ ఫారడే జయంతి వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ కళాశాల (అటానమస్), రాజమండ్రి భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడు వి. గోపాలకృష్ణ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి ఎస్. నాగేశ్వర రావు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైకేల్ ఫారడే భౌతిక శాస్త్ర రంగానికి చేసిన విశేష కృషిని వివరించారు. భౌతిక శాస్త్ర నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య, ఉద్యోగ మరియు పరిశోధనా రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను తెలియజేశారు. ముఖ్యంగా ప్రయోగాత్మక పరిశోధన రంగాల్లో లభిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భౌతిక శాస్త్ర విభాగాధిపతి సి.హెచ్. కోమల లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచానికి మైకేల్ ఫారడే అందించిన సేవలు మరియు ఆయన పరిశోధనా కార్యకలాపాల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం విద్యార్థుల కోసం నిర్వహించిన క్విజ్ మరియు ఉపన్యాస పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భౌతిక శాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్