గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionUS Open : మూడోరౌండ్‌‌కు అల్కరాజ్‌

1 గంట క్రితం

alcaraz-2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 11:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సబలెంక, స్విటోలినా కూడా..

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌‌ మూడోరౌండ్‌‌కు మాజీ నంబర్‌ ‌వన్‌ ఆటగాడు, స్పెయిన్‌ ‌యువ సంచలనం కార్లోస్‌ అల్కరాజ్‌ ‌ప్రవేశించాడు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ ‌పోటీలో అల్కరాజ్‌ ‌నాలుగుసెట్ల హోరాహోరీ పోరులో పోర్చుగల్‌‌కు చెందిన ఫారియాపై విజయం సాధించాడు. తొలి సెట్‌‌ను 4-6తో కోల్పోయిన అల్కరాజ్‌.. ఆ తర్వాత మూడు సెట్లను 6-0, 6-3, 6-2తో ముగించాడు. ఇతర పోటీల్లో 15వ సీడ్‌ ‌బుబ్లిక్‌(‌కజకిస్తాన్‌), 20వ సీడ్‌, అమెరికాకు చెందిన టామీ పాల్‌, టియాఫో ప్రత్యర్థులను ఓడించి మూడోరౌండ్‌‌కు చేరారు. 15వ సీడ్‌ ‌బుబ్లిక్‌ 6-3, 6-1, 6-1తో మన్నారినో(ఫ్రాన్స్‌)‌ను, పాల్‌ 6-2, 6-3, 5-7, 6-4తో డినో ఫ్రిజ్మిక్‌(‌క్రొయేషియా), 11వ సీడ్‌(అమెరికా) టియాఫో 6-3, 7-6(7-2), 7-5తో సకమోటో(జపాన్‌)‌ను చిత్తుచేసి మూడోరౌండ్‌‌కు చేరారు. ఇక అన్‌‌సీడెడ్‌ ‌సిట్సిపాస్‌(‌గ్రీక్‌) 6-7(1-7), 6-3, 7-6(7-4), 6-4తో ఎల్‌. హారిస్‌(‌దక్షిణాఫ్రికా), 18వ సీడ్‌, చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన లెహెక్కా 6-4, 6-2, 6-4తో టోబై శామ్యూల్‌(‌బ్రిటన్‌)‌ను ఓడించారు.

సబలెంకా సునాయాసంగా..

మహిళల సింగిల్స్‌‌లో టాప్‌‌సీడ్‌, బెలారస్‌‌కు చెందిన అర్యానా సబలెంక రెండోరౌండ్‌‌లో సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన రెండోరౌండ్‌ ‌పోటీలో సబలెంక 6-1, 6-1తో ఇటిసెంకో(రష్యా)ను చిత్తుచేయగా.. 9వ సీడ్‌, ఉక్రెయిన్‌‌కు చెందిన స్విటోలినా 6-2, 6-7(6-8), 6-4తో జాయింట్‌(ఆస్ట్రేలియా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇక 29వ సీడ్‌ ‌లీ(అమెరికా) 5-7, 7-6(7-4), 6-4తో వేకిక్‌(‌క్రొయేషియా), 18వ సీడ్‌ అలెగ్జాండ్రోవా(రష్యా) 6-1, 2-6, 6-3తో బిరెల్‌(ఆస్ట్రేలియా)పై మూడుసెట్ల హోరాహోరీ పోరులో గెలిచి మూడోరౌండ్‌‌కు చేరారు. ఇక 7వ సీడ్‌, చెక్‌ ‌రిపబ్లిక్‌‌కు చెందిన ముఛోవా 6-1, 6-0తో బౌల్టర్‌(‌బ్రిటన్‌), 21వ సీడ్‌, రష్యాకు చెందిన కలిన్స్కయా 7-5, 2-6, 6-3తో చైనాకు చెందిన వాంగ్‌‌ను చిత్తుచేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్