శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

యోగా పోటీల్లో వరుణవి డబుల్ ధమాకా

7 గంటల క్రితం

sport
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రెండు విభాగాల్లో ప్రథమ స్థానం.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక


ప్రకాశక్తి -అనంతపురం : అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అనంతపురానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని బి.వరుణవి యోగాలో సత్తా చాటింది. అనంతపురం ఇండోర్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన అండర్‌–17 యోగా పోటీల్లో ట్రెడిషనల్ యోగా, ఆర్టిస్టిక్ యోగా విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించి డబుల్ ధమాకా నమోదు చేసింది. దీంతో ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌ క్రీడా పోటీలకు వరుణవి ఎంపికైంది. వరుణవి చియ్యేడు గ్రామానికి చెందినది. ఆమె తండ్రి పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తుండటంతో ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటున్నారు. నగరంలోని రావూస్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వరుణవి చదువుతోపాటు యోగాలోనూ ప్రతిభ కనబరుస్తోంది. క్రమశిక్షణతో కూడిన సాధనతోనే విజయం యోగాలో రాణించాలనే లక్ష్యంతో వరుణవి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తన యోగా గురువు కృష్ణవేణి మేడమ్‌ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. కేవలం రెండు నెలల క్రితం జరిగిన రాష్ట్రస్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రథమ స్థానం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనం. తాజాగా జిల్లా స్థాయిలోనూ రెండు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ వరుణవి ఇదే ప్రతిభను కొనసాగించి మంచి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రులు, యోగా గురువు కృష్ణవేణి, పాఠశాల ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.
image


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్