శుక్రవారం, 14 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్కెట్లపై అంతర్జాతీయ ఒత్తిళ్లు

2 గంటల క్రితం

sensex
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెన్సెక్స్‌ 71 పాయింట్ల తగ్గుదల

ముంబయి : హర్మూజ్‌ జలసంధి వద్ద నౌకల దిగ్బంధనంపై అమెరికా హెచ్చరికలకు తోడు అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరగడం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో చివరికి సెన్సెక్స్ 71 పాయింట్లు క్షీణించి 78,009.25కు పరిమితమయ్యింది. నిఫ్టీ 29.85 పాయింట్ల నష్టంతో 24,366 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 95.43గా నమోదు కాగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్ ధర 87 డాలర్లకు చేరింది. సెన్సెక్స్-30లో ఏషియన్‌ పెయింట్స్‌, ఇండిగో, ఎన్‌‌టిపిసి, ఎస్‌బిఐ షేర్లు నష్టపోగా, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం షేర్లు లాభాల్లో ముగిశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్