- 9వ సారి అండర్-19 ఆసియా కప్ కైవసం
మస్కట్(ఒమన్): అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా కుర్రాళ్లు కేక పుట్టించారు. లీగ్ దశలో పాకిస్తాన్ చేతిలో ఓడి.. టైటిల్ పోరులో 338 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ తేడాతో గెలిచిన తీరు అత్యద్భుతం. పాక్‌పై చిరస్మరణీయ గెలుపుతో టీమిండియా యువ క్రికెటర్లు ఫుల్ జోష్ నింపింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయచందన్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్యవీర్ సెహ్వాగ్ 61 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం లక్ష్య రాజేశ్ రాయచందన్ 101 బంతుల్లో 80 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అయితే ఆర్యవీర్ ఔటైన తర్వాత వికెట్లు వరుసగా పడిపోయాయి. వీకే వినీత్(24), అర్జున్ రాజ్‌పుత్(16), యశ్‌బర్ధన్ చౌహాన్ 9 పరుగులు చేశారు. కెప్టెన్ లక్ష్యతో పాటు అన్వయ్ ద్రవిడ్ కూడా పెవిలియన్‌కు చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. ఒక దశలో భారత్ 251 పరుగు లకే ఏడు వికెట్లు కోల్పోయింది. లక్ష్యం ఇంకా దూరంలో ఉండగా వికెట్లు వరుసగా పడటంతో పాకిస్తాన్ విజయం ఖాయమనిపించింది. ఈ సమయంలో మానల్ చౌహాన్, మొహిత్ ఉల్వా అద్భుత పోరాటం చేశారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మానల్ చౌహాన్ 32 బంతుల్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మొహిత్ ఉల్వా మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 22 బంతుల్లో 43 పరుగులు చేసి భారత విజయంపై ఆశలు రేకెత్తించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మానల్ ఔటైనా మొహిత్ పోరాటం ఆపలేదు. చిగురుపాటి వెంకటతో కలిసి జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. పాకిస్తాన్ తరఫున అహ్మద్ హుస్సేన్ బంతిని అందుకున్నాడు. మరోవైపు మొహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట క్రీజులో ఉన్నారు. తొలి బంతికి మొహిత్ పరుగులేమీ చేయలేదు. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతికి వెంకట ఒక పరుగు సాధించడంతో భారత్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది. నాలుగో బంతికి మొహిత్ మరో పరుగు తీశాడు. ఐదో బంతికి వెంకట సింగిల్ తీసుకోవడంతో స్కోరు సమం కావడానికి అవసరమైన పరిస్థితి ఏర్పడింది. చివరి బంతికి మొహిత్ ఉల్వా ఫోర్ బాదడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. 9 వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత పోరాటంతో భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ టైటిల్‌ను భారత్ రికార్డుస్థాయిలో 9వ సారి కైవసం చేసుకొంది.
స్కోర్‌బోర్డు...
పాకిస్తాన్ (అండర్-19) ఇన్నింగ్స్: ఉస్మాన్ ఖాన్ (సి)రాజ్‌పుత్ (బి)కావ్య పాటేల్ 107, హయ్యమ్ ఖాన్ (సి)అనయ్ ద్రావిడ్ (బి)కావ్య పాటేల్ 21, అబ్దుల్ ఖాదిర్ (సి)వినీత్ (బి)అర్జున్ రాజ్‌పుత్ 80, ఫర్హాన్ యూసుఫ్ (సి)అర్యాన్ (బి)చిగురుపాటి 63, అహ్మద్ హుసైన్ (సి)అన్వీర్ సెహ్వాగ్ (బి)చిగురుపాటి 17, హంజా జహూర్ (సి)మోహిత్ ఉల్వా (బి)కావ్య పాటెల్ 10, అబ్బాస్ ధార్ (సి)యశ్‌బర్దన్ (బి)చిగురుపాటి 2, మహ్మద్ సయ్యామ్ (రనౌట్)అన్వయ్ ద్రావిడ్ 7, నిఖాబ్ షఫీక్ (బి)కావ్య పాటెల్ 11, రిజ్వానుల్లా (నాటౌట్) 4, అలీ రాజా (నాటౌట్) 0, అదనం 15. (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 237పరుగులు.
వికెట్ల పతనం: 1/62, 2/197, 3/240, 4/299, 5/305, 6/311, 7/317, 8/332, 9/336 బౌలింగ్: మోహిత్ 8-0-57-0, పాటెల్ 10-0-68-4, చిగురుపాటి 5-0-40-3, మనాల్ 3-0-40-0, ఆర్యాన్ 7-0-36-0, యశ్‌బర్దన్ 6-0-35-0, అర్జున్ 7-0-43-1, వినీత్ 4-0-14-0.
ఇండియా (అండర్-19) ఇన్నింగ్స్: లక్ష్య రాజేశ్ (సి)అబ్బాస్ (బి)అలీ రాజా 80, ఆర్యవీర్ సెహ్వాగ్ (సి)ఉస్మాన్ (బి)నికాబ్ 58, వినీత్ (సి)ఉస్మాన్ (బి)రిజ్వానుల్లా 24, అర్జున్ (సి)మంజా (బి)రిజ్వానుల్లా 16, యశ్‌బర్దన్ (సి)ఉస్మాన్ (బి)అబ్బాస్ 9, అన్వయ్ ద్రావిడ్ (రనౌట్)ఫర్హాన్ 19, మనాల్ (సి)ఉస్మాన్ (బి)నకీబ్ షఫీక్ 47, అర్యాన్ (సి)హయమ్ (బి)రిజ్వానుల్లా 9, కావ్యా పాటెల్ (సి)జహూర్ (బి)మహ్మద్ 0, మోహిత్ ఉల్వా (నాటౌట్) 49, చిగురుపాటి (నాటౌట్) 11, అదనం 17. (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 339 పరుగులు. వికెట్ల పతనం: 1/95, 2/146, 3/172, 4/186, 5/217, 6/217, 7/251, 8/252, 9/309 బౌలింగ్: అలీ రాజా 10-0-65-1, మహ్మద్ 10-0-79-1, రిజ్వానుల్లా 10-0-53-3, నకీబ్ షఫీక్ 10-0-57-2, అహ్మద్ హుసైన్ 5-0-38-0, అబ్బాస్ 5-0-39-1.









కామెంట్‌లు (0)